ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్ | I am not Defeated in life:KCR | Sakshi
Sakshi News home page

ఓటమిలేని జీవితం నాది: కెసిఆర్

Sep 10 2014 3:07 PM | Updated on Aug 15 2018 9:22 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

కె.చంద్రశేఖర రావు

ఓటమి అనేది తన జీవితంలో లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు.

హైదరాబాద్:  ఓటమి అనేది తన  జీ వితంలో లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. అనుకున్నది ప్రతి ఒక్కటీ సాధించానన్నారు. ''తెలంగాణ రాదన్నారు. సాధించి చూపించాను''అని చెప్పారు.  తమ  ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తాగునీటి  గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మూడున్నర ఏళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపడుతామన్నారు.  వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై తెలంగాణలో సర్వే నిర్వహిస్తాని చెప్పారు.

గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడి  కూడా తెలంగాణ సర్వే గురించి అడిగారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే నిర్వహించాలని ప్రధాని మోడీకి తాను సూచించానని కేసీఆర్ చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement