
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో మానవ వనరులే కీలకమని కేరళ ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి పి.హెచ్.కురియన్ అన్నారు. శనివారం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఒడిశాలోని కలహందిలో పనిచేసిన సమయంలో తాను ఎదుర్కొన్న అను భవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన 52 మందికి పట్టాలు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ (పీఆర్) డైరెక్టర్ జనరల్ డబ్లు్య.ఆర్.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎ.దేవీప్రియ, ఆకాంక్షాశుక్లా పాల్గొన్నారు.