
ప్రతీకాత్మక చిత్రం
తేనెటీగలు మూకుమ్మడి దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి జనం పరుగులు తీశారు.
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని గంగాధర మండలం గర్శకుర్తిలో బుధవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించడంతో శవయాత్ర చేస్తున్న బంధువులు, గ్రామ ప్రజలపై తేనెటీగలు మూకుమ్మడి దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి జనం పరుగులు తీశారు. అయితే, తేనెటీగలు పెద్ద ఎత్తున కుట్టడంతో లచ్చయ్య అనే వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. 35 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులు కరీంగనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.