ఓయూ క్యాంపస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం | High tension in Osmania University Campus | Sakshi
Sakshi News home page

ఓయూ క్యాంపస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం

Aug 7 2014 2:48 PM | Updated on Nov 9 2018 4:10 PM

ఓయూలోని ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చడాన్ని నిరసిస్తు స్థానిక విద్యార్థులు గురువారం యూనివర్శిటీ క్యాంపస్లో కదం తొక్కారు.

హైదరాబాద్:  ఓయూలోని ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చడాన్ని నిరసిస్తు స్థానిక విద్యార్థులు గురువారం యూనివర్శిటీ క్యాంపస్లో కదం తొక్కారు. చలో తార్నాక కార్యక్రమానికి ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. ఓయూ క్యాంపస్ సమీపంలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

దాంతో విద్యార్థులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీసు స్టేషన్కు తరలించారు. దాంతో ఓయూ క్యాంపెస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement