తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్: తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి రెండుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, పలుచోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర మంతటా పలుచోట్ల, ఉష్ణోగ్రతలు 41 పైనే నమోదై, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-4 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశముందన్నారు. నేడు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లా నిప్పులగుండంలా మారింది. ఆదిలాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.