సివిల్ వివాదాల్లో ఆస్తుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులను పోలీ సులు అమలు చేయాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది.
సివిల్ వివాదాల్లో ఆస్తులపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో ఆస్తుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులను పోలీసులు అమలు చేయాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఉత్తర్వులిచ్చినప్పటికీ ఓ స్థలంలోకి ఇతరులను అనుమతించడాన్ని తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్‌షాకోట్ ఎకరా భూమి వివాదం రంగారెడ్డి జిల్లా రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.
దీని అమలుకు పిటిషనర్లు సహాయం కోరినా పోలీసు పట్టించుకోలేదు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపి కోర్టు ఉత్తర్వులిచ్చినా, పిటిషనర్ల స్థలానికి రక్షణ కల్పించేందుకు సైబరాబాద్ పోలీ సులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.