నేటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు  | Heavy Rains In Telangana On Tomorrow | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు 

Jun 30 2019 2:51 AM | Updated on Jun 30 2019 8:56 AM

Heavy Rains In Telangana On Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సారంగాపూర్, బజర్హతనూర్‌ల్లో 7 సెం.మీ., దిల్‌వార్‌పూర్, వంకడి, ఖానాపూర్‌ల్లో 6 సెం.మీ., కమ్మర్‌పల్లి, ఆర్మూర్, నందిపేట, భూపాలపల్లి, మోర్తాడ్, బోథ్, మంథని, నవీపేట్‌ల్లో 5 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement