వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు | Heavy Floods In Musalamma Vagu At Mulugu District | Sakshi
Sakshi News home page

వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు

Aug 7 2019 1:38 PM | Updated on Aug 7 2019 1:39 PM

Heavy Floods In Musalamma Vagu At Mulugu District - Sakshi

బాధితులను వాగు దాటిస్తున్న గ్రామస్తులు

సాక్షి, ములుగు: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. బుధవారం జిల్లాలోని మండపేట మండలంలో తిమ్మాపూర్‌ వద్ద ముసలమ్మ వాగు వరద నీటితో ఉదృతంగా పారుతోంది. కూలీ పనులకు వెళ్లిన 40 మంది వాగు దాటుతూ.. వారదలో చిక్కుకొని ఆరు గంటలపాటు వరద నీటిలో నరకయాతన అనుభవించారు. దీంతో తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో మండలంలో ఆందోళన వాతావరణం నెలకొంది. కాగా సమాచారం అందుకున్న పిసా చట్టం కోఆర్డినేటర్, స్థానిక గ్రామస్తులు బాధితులను రక్షించేందుకు సాహసం చేసి తాళ్ల సాయంతో వాగును దాటించారు. దీంతో వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డ కూలీలు ఊపిరి పిల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement