బతికినవి 42 శాతమే!

haritha haram plants are going waste - Sakshi

    ఎండిపోతున్న హరితహారం మొక్కలు

      నిమ్మకు నీరెత్తినట్లు అధికారుల తీరు 

చారకొండ : మండల పరిధిలో హరితహారం అబాసుపాలవుతోంది. నాటిన మొక్కలు సగానికంటే ఎక్కువగానే ఎం డిపోయాయి. కేవలం 42శాతం మొ క్కలు మాత్రమే బతికాయని అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. 

  నాటినవి లక్షా 60 వేలు.. 

మండల పరిధిలోని జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి, సిరుసనగండ్ల, చారకొండ, చంద్రాయన్‌పల్లి, గోకారం తదితర గ్రామాల్లో 1లక్ష 60వేల మొక్కలు నాటారు. ప్రస్తుతం 42శాతం మొక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ   పాఠశాలలు, కార్యాలయాల వద్ద   నాటిన మొక్కలు మాత్రమే ఆయా యజమాన్యాల చొరవతో మొక్కలు   సజీవంగా  ఉన్నాయి. గ్రామాలలో రోడ్లపై, ఖాళీస్థలాలలో నాటిన మొక్కలను బతికించే బాధ్యత మండల పరిషత్‌ అధికారులకు ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

కలెక్టర్‌ ఆదేశించినా..

మొక్కలను పెంచే బాధ్యత మండల పరిషత్‌ అధికారులదేనని కలెక్టర్‌ చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నాటిన మొక్కలు చనిపోయాయి. ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓగా వంగూరు మండల అధికారి హిమబిందును నియమించ డంతో ఆమె వంగూరుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో హరితహారం భవి తవ్యం ప్రశ్నార్థకమంగా మా రుతోంది. 

నిర్లక్ష్యం తగదు... 

ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అదికారుల నిర్లో్యంతో నీరుగారుస్తంన్నారు. మొక్కలు నాటి వాటివంక చూడకుండా పోతున్నారు. మాగ్రామంలో ఎంతో హడావిడిగా దేవాలయాలవద్ద, రోడ్లవద్ద, మజీద్‌లవద్ద మొక్కలు నాటారు. నీరులేక ఎండిపోయాయి. ప్రభుత్వ అదికారులు మొక్కలు సంరక్షించే బాధ్యత మరిచి పోయారు. కాలుష్య నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రకృతిలో మొక్కల పాత్ర ప్రధానమైనది. మొక్కలు పెంచడంలో నిర్లక్షం వహించరాదు.                – జగపతి, జూపల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top