వారి కడుపుకోత తీర్చలేనిది | harish rao provided compensation to the families | Sakshi
Sakshi News home page

వారి కడుపుకోత తీర్చలేనిది

Jul 28 2014 1:42 AM | Updated on Sep 2 2017 10:58 AM

వారి కడుపుకోత తీర్చలేనిది

వారి కడుపుకోత తీర్చలేనిది

బాధిత కుటుంబాలకు ఎంత డబ్బు ఇచ్చినా ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీర్చలేమని, బాలల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు హామీ ఇచ్చారు.

బాలల కుటుంబాలకు పరిహారం అందజేసిన మంత్రి హరీశ్‌రావు
 
తూప్రాన్: బాధిత కుటుంబాలకు ఎంత డబ్బు ఇచ్చినా ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీర్చలేమని, బాలల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు హామీ ఇచ్చారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతిచెందిన 14 మంది చిన్నారుల గ్రామాలు ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్‌లలో ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌లతో కలిసి హరీశ్‌రావు పర్యటించారు.
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.70 లక్షల చెక్కులను ఆందజేశారు.  14 మంది చిన్నారులతో పాటు, స్కూల్ బస్సు డ్రైవర్ భిక్షపతిగౌడ్, క్లీనర్ రమేశ్‌లకు రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలను కూడా ఆయన మృతుల కుటుంబాలకు అందజేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వర చర్యలు చేపట్టినట్టు చెప్పారు.  ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష, రైల్వేశాఖ లక్ష చొప్పున అందిస్తున్నట్టు తెలిపారు.
 
సదానంద రాకపోవడం శోచనీయం

ఇదిలా ఉండగా, రైలుప్రమాదం జరిగి నాలుగు రోజులు కావస్తున్నా కేంద్ర రైల్వేమంత్రి సంఘటన స్థలానికి రాకపోవడం శోచనీయమని హరీశ్ ఆరోపించారు.  క్షతగాత్రులను కూడా పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ,  మృతి చెందిన కుటుంబాలను చూస్తే గుండే తరుక్కుపోతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement