సిద్ధిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : హరీశ్‌ రావు

Harish Rao Present ZP Chairman Oath Taking Ceremony At Siddipet - Sakshi

సాక్షి, సిద్ధిపేట : జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా పని చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పరిషత్‌ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గొప్ప అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఈ సారి జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా అయిన సిద్ధిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో బాగా పని చేసే అధికారులన్నారని వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.

సభలో, సమావేశాల్లో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే విధంగా ఉండాలన్నారు హరీశ్‌ రావు. హెడ్‌లైన్‌ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేను అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలన్నారు. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారే గొప్పవారవుతారని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top