‘ఆయన సాయంతోనే కాళేశ్వరం అనుమతులు’

Harish Rao Invites Nitin Gadkari To Visit Kaleshwaram Project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత వేగంగా పూర్తవుతోన్న ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన హరీశ్‌ రావు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. గడ్కరీ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని పేర్కొన్న హరీశ్‌.. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top