టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసిందేమీ లేదని గుత్తా విమర్శించారు. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.