జీఎస్టీ అపరాధ రుసుము ఎత్తివేత | GST penalty was dropped | Sakshi
Sakshi News home page

జీఎస్టీ అపరాధ రుసుము ఎత్తివేత

Jun 13 2018 1:18 AM | Updated on Aug 31 2018 8:42 PM

GST penalty was dropped  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసుకునేందుకు ట్రాన్‌–1, జీఎస్టీఆర్‌–3బీ రిటర్నులు దాఖలు చేయని జీఎస్టీ డీలర్లకు అపరాధ రుసుము లేకుండా మళ్లీ దాఖలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సాంకేతిక కారణాలతో ట్రాన్‌–1తో పాటు జీఎస్టీఆర్‌–3బీ దాఖలు చేయని డీలర్లకు మరో మంచి అవకాశం లభించినట్లయింది. ఐటీసీ క్లెయిమ్‌ చేసుకునేందుకు తమకు అవకాశం లేకుండా పోతోందని కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌–2017 నుంచి ఏప్రిల్‌–2018 వరకు జీఎస్టీ ట్రాన్‌–1 డిక్లరేషన్‌ చేసి డిసెంబర్‌–2017 నాటికి కామన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయని వారికే ఇది వర్తించనుంది. ఈ ఏడాది మే 10 నాటికి ట్రాన్‌–1 డిక్లరేషన్, ప్రతి నెలా జీఎస్టీఆర్‌–3బీ రిటర్నులు.. మే 31 నాటికి దాఖలు చేసిన వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement