బీడీలకు మోక్షం లభించలేదు : ఈటల | GST Council does not approve reduce GST on bidi's  | Sakshi
Sakshi News home page

బీడీలకు మోక్షం లభించలేదు : ఈటల

Jan 18 2018 8:01 PM | Updated on Jan 18 2018 8:08 PM

GST Council does not approve reduce GST on bidi's  - Sakshi

న్యూఢిల్లీ : బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్‌ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సిగరెట్లతో సమానంగా అంటే 28 శాతం పన్నును బీడీ ఉత్పత్తులపై విధించడం సరికాదని కోరినప్పటికీ, ఫిట్‌మెంట్‌ కమిటీ ఒప్పుకోలేదని చెప్పారు. అయితే డ్రిప్‌ ఇరిగేషన్‌ వస్తువులకు మాత్రం జీఎస్టీ రేటు 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 25వ సమావేశంలో పన్ను ఎగవేత లేకుండా ఈ-వే బిల్లు అమలు చేయడంపై చర్చ జరిగినట్టు చెప్పారు. జీఎస్టీ చట్టాల సవరణలపై తదుపరి మీటింగ్‌లో చర్చ ఉంటుందని తెలిపారు. అంతేకాక పెట్రోల్‌, డీజిల్‌, రియల్‌ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై నేడు(గురువారం) చర్చ జరుగలేదని పేర్కొన్నారు. 
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతిపాదించిన అభ్యర్థనలు...

  • ప్రోగ్రెసివ్‌ రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలి
  • యువతకు ఉపాధి కల్పించే వ్యవసాయం, చిన్నమధ్య తరహా పరిశ్రమలపై దృష్టిపెట్టాలి
  •  రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి, గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులకు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.10వేల కోట్ల బడ్జెట్‌ కోరాం
  • హైదరాబాద్‌ మినహా మిగతా 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరాం
  • ప్రతి ఎకరానికి, ప్రతి పంటకు పెట్టుబడి చేయూత పథకం కోసం ఆర్ధికంగా సహాయం, కరెన్సీ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement