
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద 5 శాతం, 18 శాతం జీఎస్టీ స్లాబ్స్ తీసుకురావడంతో.. చాలా వస్తువుల ధరలతో పాటు, వాహనా ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇందులో చిన్న కార్లు, బైకుల ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మాత్రం యధావిధిగా 5 శాతం స్లాబులోనే నిలిచాయి.
రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద ఉన్న కార్లు 5 శాతం స్లాబులో, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలు 18 శాతం స్లాబులో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. టాటా మోటార్స్, మహీంద్రా కార్ల ధరలలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ కార్ల ధరలు 5 శాతం స్లాబులో ఉండటం వల్ల.. ధరలు కొంత నిర్దిష్టంగా ఉంటాయి. ఇది కొనుగోలుదారుల సంఖ్య పెంచుతుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే.. కాలుష్య కారకాలు తగ్గుతాయి. తద్వారా క్లిన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. ఈ కారణంగానే ఈవీలను 5 శాతం స్లాబులో ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ఈ సంవత్సరం ఏప్రిల్ - జూలై మధ్య.. ఈవీ అమ్మకాలు 15,500 యూనిట్లను చేరుకున్నారు. ఇందులో టాటా మోటార్స్ 40% వాటాతో మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా 18% వాటాతో ఉంది. టెస్లా కూడా దేశంలో దాని మోడల్ Yతో ప్రవేశించింది, అయితే డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు.