వింతగా గ్రేటర్‌ వాతావరణం  | Greater HYD weather as strange | Sakshi
Sakshi News home page

వింతగా గ్రేటర్‌ వాతావరణం 

May 10 2018 1:38 AM | Updated on May 10 2018 1:38 AM

Greater HYD weather as strange - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఉదయం మండుటెండ, మధ్యాహ్నం వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు. బుధవారం నగర వాతావరణంలో ఈ వింత చోటుచేసుకుంది. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతోన్న గ్రేటర్‌ ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

సాయంత్రం 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురిశాయి. గరిష్టంగా 39.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సైతం సాధారణంకంటే 2 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణంలో ప్రస్తుతం చోటుచేసుకున్న మార్పులు అసాధారణమేమీ కాదని స్పష్టంచేసింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement