సమస్యల పరిష్కారానికి సమ్మె

Gram Panchayat Staff On Strike - Sakshi

బిజినేపల్లిరూరల్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి చాలీచాలని కూలీతో వెట్టి చాకిరీ చేస్తున్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 23నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌ శ్రీను తెలిపారు. శుక్రవారం బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆ యా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికు ల వలె గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, జీఓనం. 212, 112లను సవరించి ఈ జీఓలు వర్తించే వారందరినీ పర్మినెంట్‌ చేయాలని, కర్ణాటక రాష్ట్ర తరహాలో గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

పం చాయతీ కార్యదర్శుల పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్, బిల్‌ కలెక్టర్‌ వంటి ఉద్యోగాల్లో పంచాయతీ కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పలు రకాల ఒప్పందాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ నెల 23 నుంచి తెలంగాణవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్‌ మండల చైర్మన్‌ హన్మంతు, టీమాస్‌ మండల చైర్మన్‌ రాంచందర్, బీఎల్‌ఎఫ్‌ కోకన్వీనర్‌ చంద్రశేఖర్, కార్మిక మండల అధ్యక్షులు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు శుభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 
ఎంపీడీఓకు సమ్మె నోటీసు 
తెలకపల్లి: మండల కేంద్రమైన తెలకపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీడీఓ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఈఓ సాదిక్‌బాబాకు సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి గోపాస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కార్మికులు రూ.3వేల జీతంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్మికులు అంబయ్య, సుధాకర్, ఉస్సేన్, మశమ్మ, రాంచంద్రమ్మ, అనసూయ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top