‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలి’ | Govt should run the Nizam sugar factory | Sakshi
Sakshi News home page

‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలి’

Jan 11 2015 1:08 AM | Updated on Aug 15 2018 9:27 PM

ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ చేస్తున్న పనులకు పొంతనే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ చేస్తున్న పనులకు పొంతనే లేదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement