తహసీల్దార్‌కు ధ్రువీకరణ జారీ అధికారం | Govt orders to tahsildar issuing certification authority | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌కు ధ్రువీకరణ జారీ అధికారం

Apr 26 2015 1:27 AM | Updated on Apr 4 2019 2:50 PM

కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.సి.శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.సి.శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కోసం మొదట మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి.

ఈ దరఖాస్తుకు కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, అఫిడవిట్, మృతి చెందిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 15 రోజుల్లోపు ధ్రువీకరణ పత్రం ఇచ్చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement