 
															గవర్నర్ నరసింహన్, ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు వీరి భేటీ కొనసాగింది. గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఐదు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన నరసింహన్ 2వ తేదీన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. సోమ, మంగళవారాల్లో జరిగిన గవర్నర్ల సమావేశంలో నరసింహన్ పాల్గొన్నారు. బుధవారం ప్రధాని మోదీ అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించినట్టు సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు నరసింహన్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
