మాజీ డీజీపీ బంధువుల ఇంట్లో భారీ చోరీ | Gold Worth Rs 1 Crore robbed | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ బంధువుల ఇంట్లో భారీ చోరీ

Jul 7 2015 8:23 PM | Updated on Aug 30 2018 5:27 PM

మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి సోదరుడి కుమార్తె ఇంట్లో దొంగలు పడి విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది.

బంజారాహిల్స్ (హైదరాబాద్) : మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి సోదరుడి కుమార్తె ఇంట్లో దొంగలు పడి విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.58లో నివసించే దివ్యారెడ్డి గత నెల 4వ తేదీన అమెరికా వెళ్తూ ఉంగరాలు, గాజులు ఇంట్లో ఉంచి వెళ్లారు.

అయితే గత నెల 17వ తేదీన తిరిగి వచ్చిన ఆమె.. కొన్ని రోజుల తర్వాత వాటి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆభరణాల విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకి కనిపెట్టడం కష్టతరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement