లిఫ్టిచ్చి దోచేశాడు! | gold stole with the help of morphine | Sakshi
Sakshi News home page

లిఫ్టిచ్చి దోచేశాడు!

Aug 17 2014 11:48 PM | Updated on Mar 28 2018 11:08 AM

లిఫ్టిస్తానని ఓ మహిళను కారులో ఎక్కించుకున్న దుండగుడు మత్తుమందు చల్లి ఒంటిమీదున్న నాలుగు తులాల బంగారం దోచుకెళ్లాడు.

శంషాబాద్:లిఫ్టిస్తానని ఓ మహిళను కారులో ఎక్కించుకున్న దుండగుడు మత్తుమందు చల్లి ఒంటిమీదున్న నాలుగు తులాల బంగారం దోచుకెళ్లాడు. శంషాబాద్ మండల పరిధిలోని ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. డీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న మండలంలోని తొండుపల్లికి చెందిన లక్ష్మి(35) శంషాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌కు వచ్చింది. కూరగాయలు తీసుకున్న అనంతరం మార్కెట్ బయట నిల్చుంది.

ఓ తెలుపురంగు కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తొండుపల్లిలో దింపుతానని నమ్మబలికి వాహనంలో ఎక్కించుకున్నాడు. అనంతరం దుండగుడు ఆమెపై మత్తు మందు చల్లడంతో స్పృహ కోల్పోయింది. కారులో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిప్పిన దుండగుడు చెవి కమ్మలు, పుస్తెలతాడు తీసుకొని తొండుపల్లి వద్ద వదిలేసి వెళ్లాడు. మహిళ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో శనివారం రాత్రి ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement