సముద్ర జలాలనే గోదావరి నది జలాలుగా భావించి తాము ఉన్న చోటనే పుష్కర స్నానాలను ఆచరించారు కువైట్‌లోని శ్రీకృష్ణ చైతన్య సమితి సభ్యులు.
మోర్తాడ్ (నిజామాబాద్) : సముద్ర జలాలనే గోదావరి నది జలాలుగా భావించి తాము ఉన్న చోటనే పుష్కర స్నానాలను ఆచరించారు కువైట్‌లోని శ్రీకృష్ణ చైతన్య సమితి సభ్యులు. కువైట్‌లోని వివిధ కంపెనీలలో పని చేస్తున్న తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు తెలుగువారు శ్రీకృష్ణ చైతన్య సమితిని ఏర్పాటు చేశారు.
కువైట్‌లో పని ఒత్తిడి కారణంగా స్వగ్రామాలకు వచ్చి గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఆచరించే వీలు లేకపోవడంతో సోమవారం సముద్రంలోనే పుష్కర స్నానాలను ఆచరించారు. అనంతరం గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. సముద్ర జలాలనే గోదావరి జలాలుగా భావించి పుణ్యస్నానాలు ఆచరించామని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆనందం గంగేశ్వర్ 'సాక్షి'కి ఫోన్‌లో తెలిపారు.