తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!

Goat Arrested By Panchayati Secretary In Wanaparthy - Sakshi

సాక్షి, గోపాల్‌పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను  మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్‌ తెలిపారు.  మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top