ఈ అభాగ్యుడిని పట్టించుకోరూ!

GHMC Negligence on Beggars in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: యాచక రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామంటూ వేదికలెక్కిన ప్రతిసారి మైకుల్లో ఉపన్యాసాలు దంచుతుంటారు. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌– 12లో తెలంగాణకే తలమానికంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ ఎదుట ఓ అభాగ్యుడు తన సంచులతో పాక్కుంటూ వెళ్తున్న దృశ్యం ఇది. అటు నుంచి వెళ్తున్న వారిని కంటనీరు పెట్టించింది. తెలంగాణ భవన్‌ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. యాచకులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ఒక వైపు జీహెచ్‌ఎంసీ పేర్కొంటుండగా ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూనే ఉన్నారు. ఈ అభాగ్యుడు గత రెండు వారాల నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ రహదారులపైన ఇలా నేలపై రెండు చేతులతో పాక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. తన వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి తెలంగాణ భవన్‌ రోడ్డులో పాక్కుంటూ వెళ్తున్న ఈ దీనుడిని పునరావాస కేంద్రంలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top