30 రోజుల్లో కోటి రూపాయలంటూ...

A Gang That Deals With Multilevel Marketing Busted In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకోండి.. అదెలా అంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ.. మల్టిలెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడంటూ వీరు ఈ మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి 6 లక్షల రూపాయల విలువైన గోల్డ్‌ కాయిన్లను, రూ.1.73 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తాము చెబుతామంటూ.. ఈ ముఠాలు అమాయకుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, గోల్డ్‌ కాయిన్లను సేకరించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మల్టిలెవల్‌ మార్కెటింగ్‌ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top