ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత | Full Security For IPL 2019 Match In Hyderabad | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్ట భద్రత

Mar 28 2019 1:07 PM | Updated on Mar 28 2019 1:24 PM

Full Security For IPL 2019  Match In Hyderabad - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మహేష్ భగవత్

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్ స్టేడియంలో జరిగే  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మ్యాచ్ లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 38,000 వేల మందికి కెపాసిటీ గల ఉప్పల్ స్టేడియంలో అణువణువు నిఘా ఉంటుందని తెలిపారు. ఐపీఎల్‌కు 2300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ఉంటుదని చెప్పారు. 300 సీసీ కెమెరాలు  నిఘా మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయని అన్నారు.

 స్టేడియంలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ స్టేడియంలో ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం మొత్తం డాగ్ స్వాడ్, బాంబ్ శ్వాడ్ తనిఖీలు చేసినట్లు తెలిపారు. మొబైల్స్, ఇయర్ ఫోన్ స్టేడియం లోకి అనుమతి ఉంటుంది. హెల్మెట్, పవర్ బ్యాంక్, కెమెరా, లాప్ టాప్, బ్యాగ్స్, బ్యానర్ , మిగతా ఎలక్ట్రాన్ వస్తువలకు అనుమతి లేదన్నారు. ఆక్టోపస్, ప్లాటూన్, ఆర్మ్డ్ రిజర్వ్ పోర్స్‌ అంతా కలిపి 2300 మందితో భద్రత ఉంటుందన్నారు. మ్యాచ్ జరిగే రోజు 3 గంటల ముందు నుంచి స్టేడియం లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. మెట్రో రైలు సమయం రాత్రి 12 గంటల వరకు పొడిగింపు ఉంటుందని కమిషన్‌ర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement