
సాక్షి, మహబూబాబాద్ : ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శనిగాపురం బోధ్ తండాకు చెందిన నలుగురు చిన్నారులు శనివారం సాయంత్రం తుమ్మల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ వీరంతా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.
మృతులు :
1,ఇస్లావత్ లోకేష్ (10)
2,ఇస్లావత్ ఆకాష్ (12)
3, బొడా దినేష్ ( 10)
4,బొడా జగన్ (14)