ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా

Forest Officer Missing In Boat Accident On Pranahita River - Sakshi

సాక్షి, కొమురం భీం: జిల్లాలోని చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామం సమీపంలోని ప్రాణహితనదిలో నీటి ప్రవాహానికి నాటు పడవ బోల్తాపడింది. కర్జెల్లి రేంజ్‌కు చెందిన బాలకృష్ణ, సురేష్ అనే ఇద్దరు ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్లు గల్లెంతు అయినట్లు తెలుస్తోంది. సద్దాం అనే మరో ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్‌, పడవ నడిపే వ్యక్తి, మరొకరు సురక్షితంగా ప్రమాదం నుంచి నుంచి బయటపడ్డారు. వీరితోపాటు మొత్తం ఆరుగురు ఈ పడవలో ఎక్కినట్లు తెసుస్తోంది. మహారాష్ట్రలోని అహేరి నుంచి గూడెంకు వస్తుండగా.. అధిక నీటి ప్రవాహంతో పడవలోకి నీరు చేరింది. దీంతో నాటు పడప ప్రమాదవశాత్తు నదిలో  మునిగిపోయింది. కాగా గల్లంతు అయిన ఇద్దరు బీట్‌ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం కావటంతో గూడెం వాళ్లు మహారాష్ట్రకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top