మద్యం మత్తులో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులు | Foreign students arrested in liquor | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పట్టుబడ్డ విదేశీ విద్యార్థులు

May 18 2015 2:16 AM | Updated on Oct 4 2018 7:01 PM

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లియోనియా రిసార్టులోని లియోక్లబ్‌లో నిబంధనలను ఉల్లంఘించిన 19 మంది విదేశీ యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శామీర్‌పేట్:  రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లియోనియా రిసార్టులోని లియోక్లబ్‌లో  నిబంధనలను ఉల్లంఘించిన 19 మంది విదేశీ యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుడాన్, సోమాలియా, నమీబియా, నైజీరియా, టాంజానియా, కెమారాన్, యుగాండాలకు చెందిన ఎనిమిది మంది యువతులు, 11 మంది యువకులు నగరంలోని పలు కాలేజీల్లో చదువుకుంటున్నారు.

వీరంతా లియోక్లబ్‌లో వీకెండ్ పార్టీకి వచ్చారు. అర్ధరాత్రి తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతూ డీజీహోరులో నృత్యం చేస్తుండగా మాదాపూర్ ఎస్‌వోటీ, శామీర్‌పేట్ పోలీసులు క్లబ్‌పై దాడి చేసి పట్టుకున్నారు. నిర్వాహకులు జమాసిమాదాణియా, భరద్వాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement