రిమ్స్ తొలి విజయం | first victory of the rims college | Sakshi
Sakshi News home page

రిమ్స్ తొలి విజయం

Mar 25 2014 2:32 AM | Updated on Jul 7 2018 2:52 PM

జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వైద్య కళాశాల తొలి విజయం సాధించింది.

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వైద్య కళాశాల తొలి విజయం సాధించింది. పేద ప్రజలకు వైద్య సేవలందించడమే కాకుండా.. వైద్య విద్యను అభ్యసించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా కేంద్రంలో 2008లో రిమ్స్‌ను ప్రారంభించారు. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ విద్యాభ్యాసం విజయవంతంగా ముగిసింది. ఐదు సంవత్సరాల విద్యతోపాటు, ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న 94 మంది వైద్య విద్యార్థులు సోమవారం డాక్టర్ పట్టాను అందుకున్నారు. భారతదేశంలోనే మొదటి సర్జన్ అయిన సుశ్రుత విగ్రహాన్ని రిమ్స్ వైద్య కళాశాలలో ముందుగా ఆవిష్కరించారు.

అక్కడ ఏర్పాటు చేసిన గుస్సాడీ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కళాశాల నుంచి ఆడిటోరియం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగత నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మొదటి న్యూరోసర్జన్ డాక్టర్ రాజారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రజలకు సేవలు చేసేందుకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు. వైద్యులు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరారు. వైద్యుడిని దేవునిగా కొలిచే ప్రజలను ఎప్పటికి మరిచిపోకూడదని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్‌గజరావు భూపాల్, రిమ్స్ డెరైక్టర్ శశిధర్, సూపరింటెండెంట్ సురేశ్ చంద్ర తదిత రులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement