మిఠాయి దుకాణంలో మంటలు చెలరేగడంతో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు.
యువకుడి సజీవదహనం మరో వ్యక్తికి తీవ్రగాయాలు
కీసర: మిఠాయి దుకాణంలో మంటలు చెలరేగడంతో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా నోక మండలం మాండేరియా గ్రామానికి చెందిన ఎం.అనిల్(22) కీసర ప్రధాన చౌరస్తాలో ఉన్న బాలాజీ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం రాత్రి దుకాణంలోని వంట గదిలో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున నాలుగుగంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అనిల్ మంటల్లో కాలిబూడిదయ్యాడు. అక్కడే నిద్రిస్తున్న మరో వ్యక్తి కైలాశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కేటీపీపీ కూలింగ్ టవర్‌లో ప్రమాదం
గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో రెండో దశ 600 మెగావాట్లకు చెందిన కూలింగ్ టవర్‌లో శనివారం సా యంత్రం జరిగిన ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.