చేనేత కార్మికురాలి అఘాయిత్యం.. | Female handloom weaver commits suicide | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికురాలి అఘాయిత్యం..

Sep 28 2015 5:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో చేనేత కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

వీణవంక (కరీనంగర్) : అప్పుల బాధతో చేనేత కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బీసీ కాలనీకి సబ్బని కమలమ్మ(43) చేనేత పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

దీనికితోడు కూతురు పెళ్లి చేయడానికి రూ.లక్ష అప్పుచేయడంతో అప్పు తీర్చే దారి కానరాక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement