తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ | fee reimbursement scheme to be applied for telangana students, says jagadeswara reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Jun 25 2014 1:29 PM | Updated on Aug 11 2018 7:54 PM

తెలంగాణ విద్యార్థులకే ఫీజు  రీయింబర్స్‌మెంట్‌ - Sakshi

తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

తెలంగాణకు చెందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

నల్గొండ : తెలంగాణకు చెందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల స్థానికతను గుర్తించేది తెలంగాణ ప్రభుత్వమేనని, ఎవరి జోక్యం ఉండదని ఆయన బుధవారమిక్కడ తెలిపారు.

అడ్మిషన్ల విషయంలో పాత విధానాన్నే కొనసాగిస్తామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో హైదరాబాద్‌లో చదివే సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే ప్రసక్తే ఉండదని ఆయన అన్నారు. ఈ అంశంపై నిపుణులతో చర్చించి పకడ్బందీ ఫీజుల పథకాన్ని  అమలు చేస్తామని చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement