రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలి 

Farmers should make seeds - Sakshi

ఇబ్రహీంపట్నం: రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహాదారుడు ఆశోక్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మనధాన్యం–మనవిత్తనం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రైతులు పండించిన ధాన్యం నుంచే విత్తనం తయారు చేసుకోవచ్చని తెలిపారు. మనం తయారుచేసుకున్న విత్తనాలను వెస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు.

పంటలకు రసాయన ఎరువులు వాడొద్దని సేంద్రియపు ఎరువులే వాడాలని తెలిపారు. పండించిన వడ్లను రైసుమిల్లులో పట్టించి బియ్యాన్ని అమ్ముకుని లాభాలు పొందాలని సూచించారు.  రైతులు సొసైటీగా ఏర్పడాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు ఎలిసె పాపన్న, గుజ్జుల రమేశ్, అబ్బటి రాజరెడ్డి, నాంపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top