కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి

Farmers Request to Purchasing Center Incharge Toor Dal Sales Rangareddy - Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌: కందులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రైతులు ఆరోపించారు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్‌ అధికారిణి రితిరాజ్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top