వడగళ్లు, ఈదురు గాలులు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చారుు...
హన్మకొండ : వడగళ్లు, ఈదురు గాలులు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వానతో వరి పంటలు నేలవాలారుు. చేతికొచ్చిన మామిడి కాయలు రాలిపోయూరుు. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జనగామ డివిజన్‌లో వడగళ్లు బీభత్సం సృష్టించగా.. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.
వడగళ్ల వర్షానికి జనగామ డివిజన్‌లో 797 ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. 2,095 మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. చేర్యాల మండలంలో 700 మంది రైతులకు చెందిన 300 హెక్టార్లు, మద్దూరులో 750 మంది రైతులకు చెందిన 200 హెక్టార్లు, జనగామ మండలంలో 95 మంది రైతులకు చెందిన 60 హెక్టార్లు, రఘునాథపల్లిలో 520 మంది రైతులకు చెందిన 213 హెక్టార్లు, బచ్చన్నపేట మండలంలో 30 మంది రైతులకు చెందిన 24 హెక్టార్లలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జిల్లాలో 1310 హెక్టార్లలో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. 2.4 హెక్టార్లలో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. అత్మకూరు, పరకాల మండలంలో అరటి తోటలకు నష్టం వాటల్లింది. చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట, జనగామ, లింగాలఘన్‌పూర్, దెవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.