ఉరేసుకుని రైతు ఆత్మహత్య | farmer commits suicide in nizamabad district | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని రైతు ఆత్మహత్య

May 14 2016 7:22 PM | Updated on Oct 1 2018 2:36 PM

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని గ్రామంలో ఓ అన్నదాత శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్మూరు: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని గ్రామంలో ఓ అన్నదాత శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఓరుగంటి భీమయ్య(36) నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పొలంలో మూడు వరకు బోర్లు వేయించాడు. అయినా నీరు పడక పంటలు పండలేదు. మరోవైపు సొంతంగా ఇల్లు కట్టుకుందామని నిర్మాణాన్ని తలపెట్టగా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భీమయ్య ఊరి చివర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement