breaking news
bheemaiah
-
ఉరేసుకుని రైతు ఆత్మహత్య
ఆర్మూరు: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంతని గ్రామంలో ఓ అన్నదాత శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఓరుగంటి భీమయ్య(36) నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పొలంలో మూడు వరకు బోర్లు వేయించాడు. అయినా నీరు పడక పంటలు పండలేదు. మరోవైపు సొంతంగా ఇల్లు కట్టుకుందామని నిర్మాణాన్ని తలపెట్టగా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన భీమయ్య ఊరి చివర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
వరంగల్: రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. నెక్కొండ మండలం పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన కడారి భీమయ్య(55) గొర్రెలను పట్టాలు దాటించి తను దాటే క్రమంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వరంగల్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.