రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Dec 5 2015 5:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాళెం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

మఠంపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాళెం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుచేసి వేసిన పంట వర్షాభావంతో కళ్లముందే ఎండిపోవడంతో ఆవేదన చెందిన నాగూ నాయక్(35) అనే రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి రూ.2.80 లక్షల అప్పు ఉంది. అది తీర్చే దారేదని ఆవేదన చెందేవాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. మృతుని భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement