వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుందని విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
శవంతో నర్సింగ్‌హోమ్ ఎదుట ధర్నా
Apr 26 2015 5:52 PM | Updated on Sep 3 2017 12:56 AM
నల్గొండ(సూర్యాపేట): వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు గర్భిణీ ప్రాణాలు పోగొట్టుకుందని విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు..పెనుపహాడ్ మండలం దోసపాడు గ్రామానికి చెందిన కవిత(25) ఐదు రోజుల క్రితం సూర్యాపేటలోని విజయలక్ష్మీ నర్సింగ్ హోమ్‌లో డెలివరీ కోసం చేరారు. ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేస్తుండగా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. చికిత్సపొందుతూ కవిత ఆదివారం మరణించింది. కవిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని భావించి శవంతో నర్సింగ్ హోమ్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Advertisement
Advertisement