ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా

Every Farm Is An Insurance Cover Of Rs 5 Lakh - Sakshi

సాక్షి, జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : జిల్లాలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. స్థానిక జెడ్పీ హాల్‌లో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏఈఓలకు రైతు బీమా పథకంపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఏదైని కారణంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఉపశమనం కోసం బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ లేకుంటే జూలై 1వ తేదీగా నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ పేర్లు నమోదు చేయాలన్నారు. నామినేషన్‌ వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలు ఏఈఓలు నామినేషన్‌ ఫారంలో సేకరించాల్సి ఉంటుందన్నారు. డీఏఓ, ఏడీఏ, ఏఓల పర్యవేక్షణలో ఏఈఓ రైతుల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఏఓలు సుచరిత, గోవింద్‌నాయక్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top