యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | Etela Rajender Yoga Day Celebrations in Charminar | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 20 2019 8:33 AM | Updated on Jun 21 2019 11:10 AM

Etela Rajender Yoga Day Celebrations in Charminar - Sakshi

చార్మినార్‌ వద్ద యోగా చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు

యాకుత్‌పురా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చార్మినార్‌ కట్టడం వద్ద యోగాసనాలు వేశారు. కార్యక్రమం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.  చార్మినార్‌ నుంచి మదీనా చౌరస్తా వరకు నిజామియా టిబ్బి కళాశాల వైద్య విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పత్తర్‌గట్టి కార్పొరేటర్‌ సయ్యద్‌ సోహేల్‌ ఖాద్రీ, ఆయూష్‌ డైరెక్టర్, ఐఏఎస్‌ అధికారి అలుగు వర్షిణి, నిజామియా టిబ్బి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షహజాదీ సుల్తానా, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిరాజ్‌ ఉల్‌ హక్, ప్రభుత్వ యునానీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ఎ.వకీల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement