రైతులు అధైర్యపడవద్దు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల | Etela Rajender said to farmers don't be worry | Sakshi
Sakshi News home page

రైతులు అధైర్యపడవద్దు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల

Apr 28 2015 3:37 AM | Updated on Oct 1 2018 2:00 PM

అకాలవర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడవద్దని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు...

నగురం(జమ్మికుంట రూరల్) : అకాలవర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడవద్దని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పంటలు దెబ్బతిన్ని తీవ్రంగా నష్టపోరున రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. శనివారం కురిసిన అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం పరిశీలించారు.

ఈమేరకు నగురం, గోపాల్‌పూర్, తనుగుల, నాగంపేట, శాయంపేట తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. వడగండ్లవానతో పం టలు తుడిచిపెట్టుకుపోవడం బాధాకరమన్నారు. నష్టపోరుున రైతుల జాబితా రూపొందించి తక్షణమే తనకు అందజేయూలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జేసీ పౌసుమి బసు, జెడ్పీచైర్ పర్సన్ తుల ఉమ, ఆర్డీవో చంద్రశేఖర్, తహశీల్దార్ రజని, జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement