
వ్యాపారాలు ‘పాడ’వుతున్నాయి
నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఈటల రాజేందర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
సాక్షి, హైదరాబాద్: ఎక్కువ కాలం నిల్వ ఉండని పౌల్ట్రీ, పాలు, కూరగాయలు, పలు వ్యవసాయ, వ్యవసాయాధార ఉత్పత్తుల రంగాలపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో ఈ రంగాల పరిశ్రమలు మళ్లీ నిలదొక్కుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన లేఖ రాశారు. ఈ రంగాలకు చెందిన పరిశ్రమలకు సంబంధించిన టర్మ్ రుణాల వడ్డీలు, వాయిదాల చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని జైట్లీని కోరారు. మొండి రుణాలను రీ షెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.