పోలీసులకూ నో ఎంట్రీ

Election Commission  Conditions On Police - Sakshi

సాక్షి, వైరా: ఎన్నికల విధుల్లో పబ్లిక్‌ సర్వెంట్‌ అనే పదానికి సాధారణ అర్థం పోలీసు అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. యూనిఫాంలో ఉన్నా, లేకపోయినా పోలీసులకు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదు. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లడం నిషేధం.  

  • పోటీ చేసే అభ్యర్థికి జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ ఉన్నప్పటికీ రక్షణ సిబ్బందికి పోలింగ్‌ బూత్‌లోకి అనుమతి లేదు. అభ్యర్థితో పాటు మఫ్టీలో ఉన్న ఒకే భద్రతా సిబ్బంది మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తారు.  
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్, స్టేట్‌ మంత్రులు, ఉపమంత్రులకు ప్రజల ఖర్చుతో భద్రత ఉంటుంది. వీరికి తమ వెంట వచ్చే భద్రత సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. భద్రత సిబ్బంది తలుపు బయట ఆగిపోవాలి. అక్కడ ఎవరికి ఇబ్బంది కల్గించే పని మంత్రి వెంట ఉన్న సిబ్బంది చేయరాదు.  
  •  పోలింగ్‌ సిబ్బంది తమపై ఎన్నికల అధికారులు ఆదేశాలను మాత్రమే అనుసరించాలి. రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోవద్దు. ఎన్నికల కమిషన్‌ ఆజ్ఞా పత్రం ఉంటే తప్ప పోలింగ్‌ బూత్‌లోకి రావడానికి వీలులేదు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించరాదు. మాటలు, సైగలు చేసినా నేరం కిందకే వస్తుంది.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top