
సూర్యాపేట టౌన్: సూర్యాపేటకు చెందిన అపర్ణ మెడిసిన్ విభాగంలో ఎనిమిది బంగారు పతకాలను సాధించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నట్టు విద్యార్థిని తండ్రి చలపతిరావు తెలిపారు. అపర్ణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని రామా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. సర్జరీ, మెడిసిన్ విభాగాల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిందన్నారు.