రూసా నిధుల్లో తెలంగాణకు దక్కని ప్రాధాన్యం
రూ.400 కోట్లు అడిగితే.. రూ.112 కోట్లకే ఓకే
అక్రెడిటేషన్ లేనందువల్లే నిధుల్లో భారీ కోత
హైదరాబాద్: రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ. 400 కోట్లు అవసరమని రూసా ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో ప్రతిపాదనలు అందజేస్తే కేవలం రూ.112 కోట్ల విలువైన కార్యక్రమాలకే ఓకే చెప్పింది. యూనివర్సిటీలు, కాలేజీలు నిర్వహించే కోర్సులకు నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ (న్యాక్) గుర్తింపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతోంది. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాత డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు అడిగింది. అయితే, న్యాక్ అక్రెడిటేషన్ లేకపోవడంతో నిధులు ఇప్పుడు ఇవ్వడం కుదరదని, అక్రెడిటేషన్ తెచ్చుకున్నాకే ఇస్తామని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయని, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకని ప్రశ్నించింది. వీటిపై ప్రతిపాదనలను మళ్లీ అందజేయాలని చేయాలని పేర్కొంది. ఏప్రిల్‌లో జరిగిన రూ సా సమావేశానికి రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కళాశాల విద్యా కమిషనర్ తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి సం బంధించిన వివిధ ప్రతిపాదనలను రూసా అధికారులకు అందజేశారు. అందులో కొన్నిం టికి ఒప్పుకోగా, మరికొన్నింటికి వివరణలు అడిగారు. ఇంకొన్నింటికి న్యాక్ గుర్తింపు లేనందునా నిధులు ఇచ్చేందుకు నిరాకరించారు.
వీసీలు లేకపోవడమూ కారణమే..
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్, శాతవాహన, పాలమూ రు యూని వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో యూనివర్సిటీకి రూ. 20 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరితే.. కేవలం ఉస్మానియా వర్సిటీకి మాత్రమే రూ. 20 కోట్లు ఇచ్చేం దుకు ఒప్పుకుంది. మిగిలిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు లేనందున నిధులు ఇవ్వబోమని పేర్కొంది. అయితే, 4 వర్సిటీలకు రెండు మూడేళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్లు లేకపోవడం.. ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్లు వాటికి న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆ యూనివర్సిటీలకు నిధులు రాకుండాపోయాయి.
ఇతర ప్రతిపాదనలదీ అదే దారి..
ఆదిలాబాద్ లో రూ. 12 కోట్లతో మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఓకే చెప్పకుండా... మరింత సమాచారం కావాలని కోరింది.ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కోదానికి రూ.26 కోట్లతో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కోసం రాష్ర్టం ప్రతిపాదించగా... ఇప్పటికే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయంటూ మంజూరుకు అంగీకారం తెలపలేదు. హైదరాబాద్‌లో రెండు, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లో ఒకటి చొప్పున పాత డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు తెచ్చుకుంటే మోడల్ డిగ్రీ కాలేజీలుగా అభివృద్ధికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు.
44 డిగ్రీ కాలేజీలకు అభివృద్ధి చేసేందుకు ఒక్కో దానికి రూ. 2 కోట్ల చొప్పున నిధులు అడిగితే.. న్యాక్ గుర్తింపు ఉన్న 30 కాలేజీలకు మాత్రమే అనుమతి. మిగితా వాటికి న్యాక్ గుర్తింపు వచ్చాకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలకు మోక్షం లభించలేదు. రూసా అమలులో భాగంగా ముందస్తు ఏర్పాట్ల కోసం ఇప్పటికే రూ. 2.6 కోట్లు మంజూరు చేసింది. మరో రూ. 1.4 కోట్లు రాష్ట్ర వాటాగా వెచ్చించి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.
విద్యా సంస్థలకు ‘న్యాక్’ షాక్!
Published Mon, May 4 2015 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement