
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు తనవంతు పాత్ర పోషిస్తూ ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నందుకు రాష్ట్ర ఆర్టీసీ ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్’ నుంచి పురస్కారం అందుకుంది. శుక్రవారం ఢిల్లీలో ఏఎస్‌ఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రజా రవాణాలో ఆవిష్కరణలు అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి విజయ్‌కుమార్ సింగ్ నుంచి టీఎస్‌ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్.. సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ యుగేందర్‌తో కలసి ఈ అవార్డును అందుకున్నారు.